Header Banner

రెండు రోజుల్లోనే పసిడి రేటు తగ్గుదల! ధరలు తగ్గటానికి కారణాలేమిటి?

  Fri Feb 28, 2025 07:46        Business

భారతదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే ముందుగా గుర్తొచ్చే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దిగొస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ పోగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. యూఎస్ డాలర్ పుంజుకోవడం కారణంగానే బంగారం రేటు తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

 

ఇది కూడా చదవండిఅసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట కలిగింది. గోల్డ్ రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెరుగుకుంటూనే పోయిన పసిడి ధరలు ఎట్టకేలకు దిగొస్తున్నాయి. ఇటీవల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి ఇన్వెస్టర్లు లాభాల్ని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడగా.. ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు.. అదే విధంగా యూఎస్ డాలర్ పుంజుకుంటుండటం వంటివి బంగారం ధరలు పతనం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పతననం కాగా.. అది ఇవాళ దేశీయంగా ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వరుసగా రెండు రోజుల్లో గోల్డ్ రేటు పడిపోవడం విశేషం. చాలా రోజుల తర్వాత ఇలా జరిగింది.

దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గింది. దీంతో ఇప్పుడు తులం గోల్డ్ రేటు రూ. 80,100 కు పడిపోయింది. దీనికి ముందటి రోజు కూడా రూ. 250 తగ్గింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే.. తాజాగా రూ. 440 తగ్గగా 10 గ్రాములకు రూ. 87,380 కి పడిపోయింది. ఇక్కడ ముందటి రోజు రూ. 270 తగ్గింది. దీనికి ముందు వరుస సెషన్లలో భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వద్ద కూర్చుంది. ఎట్టకేలకు ఇప్పుడు పడిపోతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ కంటే రేట్లు కాస్త ఎక్కువ స్థాయిలో ఉంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు.. ఇతర అంశాల వల్ల ఇలా జరుగుతుంది. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి ధర తులం రూ. 80,250 వద్ద ఉండగా.. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములు రూ. 87,530 పలుకుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 98 వేల వద్ద ఉంది. ముందటి రోజు ఇది రూ. 3 వేలు పడిపోవడం విశేషం. హైదరాబాద్‌లో కూడా స్థిరంగానే ఉండగా.. కేజీకి రూ. 1.06 లక్షలు పలుకుతోంది.

దేశీయంగా ఇలా ఉంటే.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. కిందటి రోజు సరిగ్గా ఇదే సమయానికి (ఉదయం 6.30 గంటలు) స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) ఏకంగా 2920 డాలర్లకుపైగా ట్రేడవగా.. ఒక్కరోజు వ్యవధిలో ఇది 40 డాలర్లకుపైగా పతనమై ఇప్పుడు 2880 డాలర్ల దిగువ స్థాయికి పడిపోయింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా భారీగా తగ్గి 31.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డాలర్ పుంజుకుంటున్న క్రమంలో.. రూపాయి పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ. 87.32 వద్ద ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi#GoldPrice #GoldRate #GoldPriceDrop #SilverPrice #IndianMarkets #GoldInvestment #BullionMarket #USDollar #ForexRates